థైరాయిడ్ / thyroid మన శరీరంలో ముఖ్యమైన గ్రంధి ,ఇది మెడ ముందు భాగంలో గొంతు కింద సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది , ఈ థైరాయిడ్ గ్రంధి నుంచి విడుదలయ్యే హార్మోన్లు మన శరీరంలో మెటబాలిజం స్థాయిలు బరువు గుండె కొట్టే వేగం జీర్ణ క్రియ మానసిక స్థితి వంటి అనేక వ్యవస్థలను నియంత్రిస్తాయి అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు నిర్లక్ష్యం చేయకూడదు
thyroid (థైరాయిడ్) మూడు రకాలు
థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి అవి హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం గోయిటర్ అయిపోతాయి అంటే థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి కావడం హైపర్థం అంటే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం గోయిటర్ అంటే థైరాయిడ్ గ్రంధి అసాధారణంగా పెరగడం
థైరాయిడ్ హార్మోన్లు ప్రధానంగా రెండు రకాలు t3 t4 ఇవి సరైన స్థాయిలో ఉండాలంటే పిట్యూటరీ గ్రంధి నుంచి విడుదలయ్యే టీఎస్ హెచ్ థైరాయిడ్ స్టీమ్ రేటింగ్ హార్మోన్ సహకారం అవసరం ఈ సమతుల్య దెబ్బతింటే థైరాయిడ్ సమస్యలు వస్తాయి
thyroid హైపర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్, గాయిటర్
హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో బరువు తగ్గడం ఎక్కువగా ఆకలి వేయడం గుండె వేగంగా కొట్టుకోవడం చెమటలు ఎక్కువగా రావడం చేతులు పలకడం నిద్రలేమి ఆందోళన కోపం త్వరగా రావడం వంటి లక్షణాలు ఉంటాయి
హైపో థైరాయిజం ఉన్నవారిలో అలసట బరువు పెరగటం తల్లి తట్టుకోలేకపోవడం జుట్టు రాలిపోవడం చర్మంపురి బారడం మలబద్దకం మానసిక మందగించడం డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి మహిళల్లో నెలసరి సమస్యలు దర్బదాలను ఇబ్బందులు కూడా రావచ్చు
Brain stroke రాకుండా ఉండాలంటే కింది చిట్కాలు పాటించండి
thyroid గయిటర్ ఎందుకు వస్తుంది? (Causes)
అయోడిన్ లోపం – ప్రధాన కారణం
హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండడం)
హైపర్ థైరాయిడిజం (హార్మోన్ ఎక్కువగా ఉండడం)
ఆటో ఇమ్యూన్ వ్యాధులు – హాషిమోటో, గ్రేవ్స్ డిసీజ్
హార్మోన్ అసమతుల్యత
గర్భధారణ సమయంలో హార్మోన్ మార్పులు
కొన్ని మందుల ప్రభావం
జన్యుపరమైన కారణాలు (Genetic)
thyroid థైరాయిడ్ గుర్తించడానికి చేసుకోవలసిన రక్త పరీక్షలు
థైరాయిడ్ సమస్యలు గుర్తించడానికి రక్త పరీక్షలు చాలా ముఖ్యమైనవి TSH , T3 , T4 లెవెల్స్ పరీక్షించడం ద్వారా సమస్య తరగతులు తెలుసుకోవచ్చు డాక్టర్ సూచన మేరకు స్కాన్ లేదా ఆల్ట్రాంగ్ కూడా చేస్తారు
thyroid తీసుకోవాల్సిన ఆహారాలు
థైరాయిడ్ సమస్యలకు ప్రధాన కారణాలు అయోడిన్ లోపం ఆటో ఇమ్యూనిటీ వ్యాధులు మోటార్స్ గ్రేప్స్ వ్యాధి జన్యుపరమైన కారణాలు పోర్మోనల్ మార్పులు అధిక స్ట్రెస్ కొన్ని మందులు ప్రభావం ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తాయి ఆహారం కూడా థైరాయిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయోడిన్ ఉన్న ఆహారాలు అయినా ఉప్పు చేపలు పాలు పెరుగు తీసుకోవాలి సెలీనియం ఉన్న గింజలు గుడ్లు ధాన్యాలు మంచివి అయిపోతాయి ఉన్నవారు ఎక్కువగా సోయా క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి ఆహారాలు పరిమితంగా తీసుకోవాలి
thyroid తీసుకోవలసిన జాగ్రత్తలు
నిత్యం వ్యాయామం చేయడం యోగ ప్రాణామాయం ధ్యానం చేయడం వల్ల హోమోల్లో సమతుల్యత మెరుగు పడుతుంది ముఖ్యంగా సూర్య నమస్కారాలు భుజంగాసనం సర్వాంగాసనం థైరాయిడ్ కు ఉపయోగంగా ఉంటుంది
గర్భిణీ మహిళలు 40, దాటిన వారు కుటుంబంలో ఉన్నవారు తరచుగా రక్త పరీక్షలు చేయించుకోవాలి లక్షణాలు కనిపించకపోయిన TSH చెక్ చేయడం మంచిది
థైరాయిడ్ ఉన్నవారు సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే తరేడు ఉన్నా కూడా సాధారణ జీవితం గడపవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు పరీక్షలు చేయించుకోవడమే తెలివైన పని
థైరాయిడ్ ఉన్నవారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే థైరాయిడ్ అనేది జీవితాంతం ఉండే సంసే కావచ్చు కానీ సరైన మందులు సరైన ఆహారం జీవనశైలి పాటిస్తే పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపడం లేదా మందులు మార్చడం చాలా ప్రమాదకరం
థైరాయిడ్ ఉన్నవారు స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా అవసరం సరిపడా నిద్ర కూడా ఉండాలి కుటుంబంతో సరదాగా గడపడం ఆందోళన తగ్గించితే చాలా మంచిది థైరాయిడ్ ఆరోగ్యానికి సహాయపడుతుంది
థైరాయిడ్ ఉన్నవారు కాఫీ టీ ఎక్కువగా తాగడం మంచిది కాదు ముఖ్యంగా థైరాయిడ్ మందులు వేసుకున్న వెంటనే కాఫీ లేదా టీ గాని తాగకూడదు మందులు వేసుకున్న తర్వాత కనీసం 30 నుంచి 40 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి మద్యం స్మోకింగ్ పూర్తిగా మానేయాలి
థైరాయిడ్ ఉన్నవారు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ మైదాతో చేసిన పదార్థాలు పూర్తిగా మానేయాలి ఎందుకంటే ఇవి బరువుని పెరగడానికి కారణం అవుతాయి ఎక్కువగా షుగర్ లెవల్స్ ను ఆహారంలో పెంచుతుంది కూల్ డ్రింక్స్ ప్యాకెట్ జ్యూసులు కూడా చాలా ప్రమాదకరం
థైరాయిడ్ ఉన్నవారు పోటీ ఉన్న ఆహారం తప్పనిసరిగా తినాలి పప్పులు, శనగలు, కందిపప్పు, పెసరపప్పు మినప్పప్పు చేపలు చికెన్ గుడ్లు తెల్ల సోనా తీసి తినాలి, గోధుమలు బ్రౌన్ రైస్ జొన్నలు రాగి వంటి చిరుధాన్యాలు మెటపాలిజోన్ని మెరుగుపరుస్తాయి
థైరాయిడ్ ఉన్నవారు క్రమం తప్పకుండా జీవన శైలి మార్చుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ గారు చెప్పిన విధంగా మాత్రలు వాడుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే థైరాయిడ్ ఉన్నా కూడా భయపడవలసిన అవసరం లేదు
thyroid థైరాయిడ్ నార్మల్ రేంజ్

🦋 Thyroid – 30 Frequently Asked Questions (FAQs)
1. థైరాయిడ్ అంటే ఏమిటి?
థైరాయిడ్ అనేది మెడలో ఉండే చిన్న గ్రంథి, ఇది శరీర మెటబాలిజాన్ని నియంత్రించే హార్మోన్లు విడుదల చేస్తుంది.
2. థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది?
మెడ ముందు భాగంలో, గొంతు కింద ఉంటుంది.
3. థైరాయిడ్ హార్మోన్లు ఏవి?
T3 (Triiodothyronine), T4 (Thyroxine).
4. థైరాయిడ్ సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి?
ప్రధానంగా 2 రకాలు – Hypothyroidism, Hyperthyroidism.
5. Hypothyroidism అంటే ఏమిటి?
శరీరానికి అవసరమైనంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం.
6. Hyperthyroidism అంటే ఏమిటి?
అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కావడం.
7. థైరాయిడ్ లక్షణాలు ఏమిటి?
అలసట, బరువు మార్పులు, జుట్టు రాలడం, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి.
8. మహిళల్లో థైరాయిడ్ ఎక్కువగా ఎందుకు వస్తుంది?
హార్మోనల్ మార్పులు, గర్భధారణ, ఆటోఇమ్యూన్ కారణాలు.
9. పురుషులకూ థైరాయిడ్ వస్తుందా?
అవును, కానీ మహిళలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
10. థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతుందా?
Hypothyroidism లో బరువు పెరగొచ్చు.
11. థైరాయిడ్ వల్ల బరువు తగ్గుతుందా?
Hyperthyroidism లో బరువు తగ్గడం జరుగుతుంది.
12. థైరాయిడ్‌కు ప్రధాన కారణాలు ఏమిటి?
ఆటోఇమ్యూన్ వ్యాధులు, అయోడిన్ లోపం, జన్యుపరమైన కారణాలు.
13. థైరాయిడ్ పరీక్షలు ఏవి?
TSH, T3, T4 రక్త పరీక్షలు.
14. TSH లెవెల్ అంటే ఏమిటి?
థైరాయిడ్ పనితీరును చూపించే ముఖ్యమైన సూచిక.
15. థైరాయిడ్ పూర్తిగా నయమవుతుందా?
చాలా సందర్భాల్లో పూర్తిగా నయం కాకపోయినా నియంత్రించవచ్చు.
16. థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా?
కొన్ని కేసుల్లో దీర్ఘకాలం అవసరం అవుతుంది (డాక్టర్ సూచనల ప్రకారం).
17. థైరాయిడ్‌కు ఆహారం ప్రభావం చూపుతుందా?
అవును, సరైన ఆహారం నియంత్రణకు సహాయపడుతుంది.
18. థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తినాలి?
కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, అయోడిన్ ఉన్న ఆహారం.
19. థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తప్పించాలి?
జంక్ ఫుడ్, అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్.
20. థైరాయిడ్ వల్ల గర్భధారణ సమస్యలు వస్తాయా?
నియంత్రణలో లేకపోతే సమస్యలు రావచ్చు.
21. గర్భధారణ సమయంలో థైరాయిడ్ ప్రమాదకరమా?
సరైన చికిత్స ఉంటే ప్రమాదం ఉండదు.
22. థైరాయిడ్ పిల్లలకు వస్తుందా?
అవును, అరుదుగా అయినా రావచ్చు.
23. థైరాయిడ్ వల్ల జుట్టు రాలుతుందా?
అవును, హార్మోనల్ అసమతుల్యత వల్ల.
24. థైరాయిడ్ వల్ల డిప్రెషన్ వస్తుందా?
కొంతమందిలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ రావచ్చు.
25. థైరాయిడ్ వ్యాధి వంశపారంపర్యమా?
కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు జన్యుపరంగా రావచ్చు.
26. థైరాయిడ్‌కు వ్యాయామం ఉపయోగమా?
అవును, తేలికపాటి వ్యాయామం మంచిది.
27. థైరాయిడ్ ఉన్నవారు యోగా చేయవచ్చా?
అవును, యోగా చాలా ఉపయుక్తం.
28. థైరాయిడ్ పరీక్షలు ఎంత తరచుగా చేయాలి?
డాక్టర్ సూచనల ప్రకారం 3–6 నెలలకు ఒకసారి.
29. థైరాయిడ్ క్యాన్సర్ సాధారణమా?
చాలా అరుదుగా వస్తుంది.
30. థైరాయిడ్ ఉన్నవారు సాధారణ జీవితం గడపగలరా?
అవును, సరైన మందులు మరియు జీవనశైలితో పూర్తి స్థాయి జీవితం గడపవచ్చు.
